A2న్యూస్, మెదక్ జిల్లా/పాపన్నపేట ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 20:
పాపన్నపేట (19) మెదక్ నియోజకవర్గం పాపన్నపేట మండలం కొడపాక గ్రామంలో పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అండగా నిలిచారు. ఆలయ నిర్మాణం కోసం మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ (ఎంఎస్‌ఎస్‌ఓ) ద్వారా 1 లక్ష ఆర్థిక సహాయాన్ని ముదిరాజ్ సంఘానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ..గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు ప్రజల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలకు తన సహకారం కొనసాగుతుందని తెలిపారు.
ముదిరాజ్ సంఘం నాయకులు, కుల సంఘాల పెద్దలు మాట్లాడుతూ.. మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఇప్పటికే పలు దేవాలయాలకు, వివిధ కుల సంఘాలకు ఆర్థిక సహాయం అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పెద్దమ్మ అమ్మవారి ఆశీస్సులతో ఎమ్మెల్యే ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

