A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 20:
మెదక్ జిల్లా (19) పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్ జి ఎఫ్) ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో జిల్లా స్థాయి అండర్-14 బాలబాలికల వాలీబాల్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ డీఎస్పీ శ్రీ ప్రసన్న కుమార్ క్రీడాకారులను పరిచయం చేసుకుని, వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. క్రీడాకారులకు ప్రభుత్వం ఉద్యోగాల్లో ఇప్పటికే 2 శాతం రిజర్వేషన్ కల్పిస్తోందని తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదిగి, ఈ రిజర్వేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాలబాలికలు పట్టుదలతో సాధన చేసి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. గెలుపుతో పాటు ఓటమినీ సానుకూలంగా స్వీకరించాలని ఆయన క్రీడాకారులకు సూచించారు. విజయం ఎంత ముఖ్యమో, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని మరింత పట్టుదలతో ముందుకు సాగడం కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రతి విద్యార్థి క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొని తన ప్రతిభను చాటుకోవాలని అన్నారు. “గెలుపు ఒక్కటే లక్ష్యం కాకుండా.. మంచి క్రీడాకారులుగా ఎదగడం, క్రమశిక్షణతో ముందుకు సాగడం, తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావడం ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉండాలి” అని డీఎస్పీ ప్రసన్న కుమార్ సూచించారు. బాలుర విభాగం: ప్రథమ స్థానం – కౌడిపల్లి మండలం ద్వితీయ స్థానం – శంకరంపేట (ఎ) మండలం తృతీయ స్థానం – వెల్దుర్తి మండలం ప్రథమ స్థానం – అల్లాదుర్గ్ మండలం ద్వితీయ స్థానం – వెల్దుర్తి మండలం తృతీయ స్థానం – శివంపేట్ మండలం ఈ కార్యక్రమంలో పాఠశాల క్రీడా సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్. నాగరాజు, పీటీఏ టీఎస్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసరావు, మధుసూదన్, పీడీలు శ్రీధర్ రెడ్డి, మాధవ రెడ్డి, దేవేందర్ రెడ్డి, ఎస్. నరేష్ కుమార్, ప్రభాకర్, రవి, శ్యామ్, రూపేందర్, ప్రతిభ, విజయ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులకు ఎస్ జి ఎఫ్ కార్యదర్శి ఆర్. నాగరాజు బహుమతులను అందజేసి అభినందించారు.

