Tuesday, September 22, 2026
Homeమెదక్బొజ్జ గణపయ్యకు ఘన వీడ్కోలు భక్తిశ్రద్ధలతో శోభయాత్ర: ప్రారంభించిన ఎస్సై మహమ్మద్ మోహినుద్దీన్

బొజ్జ గణపయ్యకు ఘన వీడ్కోలు భక్తిశ్రద్ధలతో శోభయాత్ర: ప్రారంభించిన ఎస్సై మహమ్మద్ మోహినుద్దీన్

📰 Generate e-Paper Clip

– మహిళలు కోలాటాలు, నృత్యాలతో సందడి

A2న్యూస్, నర్సాపూర్/ కుల్చారం ప్రతినిధి (బుచ్చన్న) సెప్టెంబర్ 21:

కుల్చారం (20)  మండల కేంద్రం కొల్చారంలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా శ్రీ హనుమాన్ వినాయక మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన బొజ్జ గణపయ్యకు ఏడు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆదివారం గణనాథుడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించి నిమజ్జనానికి తరలించారు.

ఆకట్టుకున్న శోభాయాత్ర

శ్రీ హనుమాన్ కాలనీ వాసులు గణపయ్యకు భక్తిపూర్వకంగా వీడ్కోలు పలికారు. మహిళలు, యువత కోలాటాలు, నృత్యాలతో సందడి చేయగా, యువకులు డీజే పాటలతో ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. భక్తుల భజనలు, గణపతి నామస్మరణలతో కొల్చారం వీధులు మార్మోగాయి.

“మళ్లీ రావయ్య గణపయ్య..”

“మళ్లీ రావయ్య గణపయ్య.. మా గండాలు తొలగించి, మా కోరికలు తీర్చావయ్య గణపయ్య” అంటూ భక్తులు గణనాథుడిని స్మరిస్తూ భావోద్వేగంతో వీడ్కోలు పలికారు. శోభాయాత్ర సందర్భంగా కొల్చారంలో భక్తి, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్, అశోక్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, పాండ్ర వెంకటేశం, తిమ్మనగారి ఆంజనేయులు, వనమాల అనిల్ శ్రీధర్ , మనోహర్, అఖిల్, రితిన్, సత్యనారాయణ, తెనుగు శేఖర్, రామా గౌడ్, శేఖర్, సారా రామకృష్ణ, నరసింహులు, వడ్ల శివ, సుదర్శన్, దుర్గాప్రసాద్ గౌడ్, చెన్నయ్య, ఆనంద్, పాండ్ర శ్రీనివాస్, శ్రీశైలం, నాగరాజ్, శేఖర్, సత్యనారాయణ ముత్యం శ్రీనివాస్ .లక్ష్మీనారాయణ, రాజు, వంశీ, సంపత్, శివ, లంబాడి శ్రీనివాస్, ప్రవీణ్, రామ్, కుమ్మరి నాగరాజ్, సంజీవులు, వినాయక కమిటీ బృందం భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!