Tuesday, September 22, 2026
Homeమెదక్లింగారెడ్డిపేట చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం

లింగారెడ్డిపేట చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం

📰 Generate e-Paper Clip

A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 21:

మనోహరాబాద్ (20) మెదక్ జిల్లా మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన అబ్బాదాసు స్వామి (39) అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. సెప్టెంబర్ 18న సాయంత్రం సుమారు 4:30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన స్వామి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ విషయమై స్వామి తమ్ముడు అబ్బాదాసు నవీన్ కుమార్ సెప్టెంబర్ 19న రాత్రి 8:10 గంటలకు మనోహరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు  సిఆర్. నంబర్.259/2026 కింద వ్యక్తి అదృశ్యం కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో భాగంగా లింగారెడ్డిపేట చెరువులో స్వామి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం తూప్రాన్ సిహెచ్ సి కి తరలించారు. మృతుడు గతంలో ప్రమాదానికి గురైనట్లు, మద్యం సేవించే అలవాటు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అలాగే గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య కుటుంబపరమైన విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఘటనకు గల పూర్తి కారణాలను నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగుతున్నట్లు మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!