ప్రజలకు అన్నదానం చేయడం అభినందనీయం: కరణం రామకృష్ణ
A2న్యూస్, హవేలి ఘనపూర్ ప్రతినిధి (ఆకుల యాదగిరి) సెప్టెంబర్ 21:
హవేలి ఘనపూర్ (20) మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ శ్రీ బాలాజీ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరణం రామకృష్ణ పాల్గొని భక్తులకు, ప్రజలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కరణం రామకృష్ణ మాట్లాడుతూ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేయూత అందించడం సంతోషకరమైన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి అధ్యక్షులు సంతోష్, సభ్యులు సురేష్, బాబు, చారి, మాణిక్యం, వెంకట్, నాగేందర్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

