Tuesday, September 22, 2026
Homeమెదక్హీరో ఆకాష్ పూరి చేతుల మీదుగా ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పోస్టర్ఆవిష్కరణ

హీరో ఆకాష్ పూరి చేతుల మీదుగా ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పోస్టర్ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 20:

లక్కీ సినిమా ప్రొడక్షన్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ప్రారంభం ఘనంగా జరిగింది. ఈ సినిమా పోస్టర్ ప్రముఖ హీరో ఆకాష్ పూరి చేతుల మీదుగా చేయడం జరిగిందని చిత్ర యూనిట్ తెలిపింది. కథానాయకులు శివాని అతిధి ముఖర్జీ పద్మ హీరోయిన్లుగా ప్రముఖ నటుడు దిల్ రమేష్  ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం 3 ఫ్లవర్. ఈ చిత్రంలో ఇంకా జబర్దస్త్ చిట్టిబాబు, పొట్టి మామ, రాంబాబు, శివం రాకీ వివా రెడ్డి, బీజేపీ బాలు, హనుమంత్ నాయక్, గడ్డం మహిపాల్, ప్రేమ్ నెల్లూరు తదితర నటి నటులు నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఒక మంచి సందేశాత్మక హర్రర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని డైరెక్టర్ అజయ్ తెలిపారు. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ సతీష్, సంగీత దర్శకులు శివ, డిఓపి మధు,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కుమార్, మెట్టపల్లి శ్రీనివాస్ మణుగూరు, స్టిల్ ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్ ప్రభాకర్, లైన్ ప్రొడ్యూసర్ రిత్విక్, దర్శకత్వ పరిరక్షణ అభి నందన్,ప్రొడక్షన్ఎగ్జిక్యూటివ్ మేనేజర్ మధు, పి ఆర్ ఓ రమేష్ లు వ్యవహరిస్తున్నారని, సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులనుఆకట్టుకుంటుందని డైరెక్టర్ అజయ్, ప్రొడ్యూసర్ సతీష్ లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!