Monday, September 21, 2026
Homeమెదక్బాల ఆధార్ నమోదును వేగవంతం చేయాలి

బాల ఆధార్ నమోదును వేగవంతం చేయాలి

📰 Generate e-Paper Clip

0–5 సంవత్సరాల లోపు పిల్లలకు బాల ఆధార్ తప్పనిసరి: కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 20:

మెదక్ జిల్లా (19) 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు బాల ఆధార్ నమోదు తప్పనిసరిగా చేయించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తల్లిదండ్రులకు సూచించారు. పిల్లల ఆధార్ నమోదును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పిల్లలకు ఆధార్ నమోదు చేయించడంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్వయంగా తన పిల్లలు ఏకాంషి, అద్వితల ఆధార్ నమోదును చేయించి ఆదర్శంగా నిలిచారు. శనివారం మెదక్ పట్టణంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఉన్న ఆధార్ నమోదు కేంద్రానికి కలెక్టర్ ప్రతిమా సింగ్ తన భర్త శుభం సింగ్‌తో కలిసి వెళ్లి తమ ఇద్దరు పిల్లల ఆధార్ నమోదును పూర్తి చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యూఐడీఏఐ 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లల కోసం ప్రత్యేకంగా బాల ఆధార్ను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. బాల ఆధార్ నీలి రంగులో ఉంటుందని తెలిపారు. పిల్లలకు ప్రత్యేక గుర్తింపును కల్పించడంతో పాటు పాఠశాల ప్రవేశాలు, పాస్‌పోర్ట్ దరఖాస్తులు, ప్రభుత్వ పథకాలు, ఇతర సేవలను పొందడంలో ఆధార్ ఉపయోగపడుతుందని వివరించారు. పిల్లలు పుట్టిన వెంటనే బాల ఆధార్ కోసం నమోదు చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఐదేళ్ల వయస్సు పూర్తైన తర్వాత ఆధార్‌లో అవసరమైన బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయించుకోవాలని, అలాగే 15 నుంచి 17 సంవత్సరాల మధ్య మరోసారి ఆధార్ అప్‌డేషన్ చేయించుకోవాలని సూచించారు. దేశంలో నివసించే ప్రతి ఒక్కరికీ ఆధార్ ఒక ముఖ్యమైన గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుందని, నవజాత శిశువుల నుంచి పెద్దల వరకు అర్హులైన ప్రతి ఒక్కరూ ఆధార్ నమోదు, అప్‌డేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు.“మీ పిల్లలకు బాల ఆధార్ నమోదు పూర్తి చేశారా? వెంటనే సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రాన్ని సంప్రదించి నమోదు చేయించండి.”

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!