కొడపాక పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆర్థిక సహాయం
A2న్యూస్, మెదక్ జిల్లా/పాపన్నపేట ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 20: పాపన్నపేట (19) మెదక్ నియోజకవర్గం పాపన్నపేట మండలం కొడపాక గ్రామంలో పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అండగా నిలిచారు. ఆలయ నిర్మాణం కోసం మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ (ఎంఎస్‌ఎస్‌ఓ) ద్వారా 1 లక్ష ఆర్థిక సహాయాన్ని ముదిరాజ్ సంఘానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ..గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు ప్రజల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు....