10 లక్షల అంచనా వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు
A2న్యూస్, సంగారెడ్డి జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 28 :
సంగారెడ్డి జిల్లా (27) పటాన్‌చెరు మండలం భానూరు గ్రామంలో ఫార్మేషన్ రోడ్డు నిర్మాణ పనులకు మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు శంకుస్థాపన చేశారు. సుమారు 10 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ రోడ్డు పనులకు ఆయన శ్రీకారం చుట్టారు.
గ్రామంలో రహదారి సదుపాయాలను మెరుగుపరిచే దిశగా ఈ పనులు చేపట్టనున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజల రాకపోకలకు సౌకర్యం కలగనుంది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

