Wednesday, October 28, 2026
Homeమెదక్గుడిసెలు లేని మెదక్‌ నిర్మాణమే లక్ష్యం!

గుడిసెలు లేని మెదక్‌ నిర్మాణమే లక్ష్యం!

📰 Generate e-Paper Clip

ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు కల్పించడమే ధ్యేయం: ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 28 :

మెదక్ జిల్లా (27)నియోజకవర్గంలో గుడిసెల్లో నివసిస్తున్న ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ పేర్కొన్నారు. ప్రతి పేద కుటుంబం సొంతింటి కలను సాకారం చేసుకోవాలన్నదే తన సంకల్పమని స్పష్టం చేశారు. మెదక్ నియోజకవర్గంలో ఒక్క గుడిసె కూడా మిగలకుండా, ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇల్లు అనేది కేవలం నాలుగు గోడల నిర్మాణం మాత్రమే కాదని, అది ఒక కుటుంబానికి భద్రత, భరోసా, ఆత్మగౌరవంతో పాటు మెరుగైన భవిష్యత్తుకు పునాది అని పేర్కొన్నారు. ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేరే వరకు తన కృషి కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. గుడిసెలు లేని మెదక్ నిర్మాణంతో పాటు విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఉపాధి వంటి కీలక రంగాల్లోనూ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తెలిపారు. ప్రతి కుటుంబానికి మెరుగైన జీవన ప్రమాణాలు, ప్రతి పేదవాడికి గౌరవప్రదమైన నివాసం అందుబాటులోకి రావాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. “గుడిసెలు లేని మెదక్‌… అభివృద్ధిలో ముందంజలో ఉండే మెదక్‌ నిర్మాణమే నా లక్ష్యం. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నిజం చేయడం నా బాధ్యత” అని ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!