Wednesday, October 28, 2026
Homeమెదక్మెదక్ జిల్లాలో బుధవారం రక్తదాన శిబిరం

మెదక్ జిల్లాలో బుధవారం రక్తదాన శిబిరం

📰 Generate e-Paper Clip

రక్తదానం.. ప్రాణదానంతో సమానం

యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి: జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 28 :

మెదక్ జిల్లా (27) పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ శిబిరంలో యువత, ప్రజలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రక్తదానం ఎంతోమంది ప్రాణాలను కాపాడే మహత్తర సేవ అని ఎస్పీ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు, శస్త్రచికిత్సలు చేయించుకునే రోగులకు, ప్రసవ సమయంలో రక్తం అవసరమైన మహిళలకు రక్తం ఎంతో కీలకమని వివరించారు. అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో లేక ప్రాణనష్టం జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఎస్పీ కోరారు. ఆరోగ్యంగా ఉండి, రక్తదానానికి అర్హత కలిగిన వారు వైద్య సిబ్బంది సూచనల మేరకు రక్తదానం చేయాలని తెలిపారు. ప్రజల్లో రక్తదానంపై అవగాహన కల్పించడంతో పాటు, ఆపదలో ఉన్నవారికి ప్రాణదాతలుగా నిలవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ప్రాణాలను కాపాడే రక్తదానంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.. పోలీసు అమరవీరుల త్యాగాలకు సమాజ సేవతో నివాళులర్పించాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!