A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ)అక్టోబర్ 28 :
మనోహరాబాద్ (27) విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల పరిధిలోని రంగయ్యపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగయ్యపల్లి గ్రామానికి చెందిన రాజబోయిన లక్ష్మణ్ (46) మంగళవారం ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో తన ఇంటి నుంచి పొలం వద్దకు వెళ్లాడు. పొలంలో ఉన్న బోరు మోటార్‌ను ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అదే సమయంలో అక్కడే ఉన్న ఆయన అన్న కుమారుడు గమనించి వెంటనే లక్ష్మణ్‌ను తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అయితే, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

