Monday, September 21, 2026
Homeమెదక్వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్ఠ చర్యలు

వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్ఠ చర్యలు

📰 Generate e-Paper Clip

కుల్చారం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్

A2న్యూస్, నర్సాపూర్/ కుల్చారం (బుచ్చన్న) సెప్టెంబర్ 20:

కొల్చారం (19) వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం కుల్చారం పోలీస్ స్టేషన్‌ను అదనపు ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న జీడీ, పార్ట్-1, ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ తదితర ముఖ్యమైన రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో భద్రపరిచిన సీజ్ చేసిన వాహనాలను పరిశీలించి, వాటికి సంబంధించిన కేసుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వినాయక నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. బ్యాంకులు, ఏటీఎంలు, ప్రధాన కూడళ్ల వద్ద సమర్థవంతమైన పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ఆస్తి సంబంధిత నేరాల నివారణకు ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని తెలిపారు. ప్రతి ఫిర్యాదును నిబంధనల ప్రకారం స్వీకరించి, బాధితులకు సత్వర న్యాయం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. కేసులకు సంబంధించిన ఆధారాలను నిబంధనల ప్రకారం ఈ-సాక్ష్యలో నమోదు చేసి భద్రపరచాలని, దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. కేసుల వివరాలను సీసీటీఎన్‌ఎస్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ, పోలీస్ స్టేషన్ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. పెండింగ్ నివేదికలను త్వరితగతిన పూర్తి చేయడంతోపాటు, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని అదనపు ఎస్పీ సూచించారు. కేసుల సత్వర పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ తనిఖీలో మెదక్ రూరల్ సీఐ ఎం. కృష్ణమూర్తి, ఎస్‌ఐ అహ్మద్ మొహినుద్దీన్తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!