Wednesday, October 28, 2026
Homeమెదక్మహర్షి వాల్మీకి జీవితం సమాజానికి స్ఫూర్తిదాయకం: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

మహర్షి వాల్మీకి జీవితం సమాజానికి స్ఫూర్తిదాయకం: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

📰 Generate e-Paper Clip

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 27:

మెదక్ జిల్లా (26) మహర్షి వాల్మీకి జీవితం, ఆదర్శాలు, ఆయన రచించిన రామాయణం సమాజానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహర్షి వాల్మీకి రచించిన రామాయణం మానవాళికి ధర్మం, సత్యం, న్యాయం, కర్తవ్యనిష్ఠ వంటి ఉన్నతమైన విలువలను బోధిస్తుందని పేర్కొన్నారు. వాల్మీకి జీవితం మనిషిలో మార్పు సాధ్యమేనని చాటిచెబుతుందని, పట్టుదల, జ్ఞానం, నిరంతర కృషితో ఉన్నతమైన లక్ష్యాలను సాధించవచ్చని అన్నారు. మహర్షి వాల్మీకి బోధనలను ఆచరిస్తూ సమాజంలో సద్భావన, సమానత్వం, నైతిక విలువలను పెంపొందించుకోవాలని సూచించారు.అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ నగేష్ మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి అంబాదాస్ రాజేశ్వర్, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఉపేందర్, బీసీ సంఘం నాయకులు, కలెక్టర్ క్యాంపు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!