Wednesday, September 23, 2026
Homeమెదక్భూ భారతి రీ-సర్వే పనులకు వేగం

భూ భారతి రీ-సర్వే పనులకు వేగం

📰 Generate e-Paper Clip

క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆర్డీవో రమాదేవి

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 23:

మెదక్ జిల్లా (22) భూ భారతి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న రీ-సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మెదక్ ఆర్డీవో రమాదేవి అధికారులను ఆదేశించారు. మంగళవారం మెదక్ మండలంలోని కొమటూర్ గ్రామంలో జరుగుతున్న భూ భారతి రీ-సర్వే పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న రీ-సర్వే ప్రక్రియ, ఫీల్డ్ విజిట్ పనుల తీరును ఆర్డీవో పరిశీలించారు. భూముల హద్దులను క్షేత్రస్థాయిలో గుర్తించే ప్రక్రియపై అధికారులను, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా, పక్కాగా నిర్వహించాలని ఆర్డీవో సూచించారు. భూముల హద్దుల గుర్తింపు సమయంలో సంబంధిత రైతులు, భూ యజమానుల సమక్షంలో వివరాలను పరిశీలించి, అవసరమైన చోట సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. రీ-సర్వే పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా క్షేత్రస్థాయిలో సర్వే బృందాలు సమన్వయంతో పనిచేసి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రీ-సర్వే ద్వారా భూముల హద్దులు, రికార్డుల వివరాలు సక్రమంగా నమోదయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కొమటూర్ గ్రామంలో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన ఆర్డీవో.. పెండింగ్‌లో ఉన్న రీ-సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేసి, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!