క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆర్డీవో రమాదేవి
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 23:
మెదక్ జిల్లా (22) భూ భారతి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న రీ-సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మెదక్ ఆర్డీవో రమాదేవి అధికారులను ఆదేశించారు. మంగళవారం మెదక్ మండలంలోని కొమటూర్ గ్రామంలో జరుగుతున్న భూ భారతి రీ-సర్వే పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న రీ-సర్వే ప్రక్రియ, ఫీల్డ్ విజిట్ పనుల తీరును ఆర్డీవో పరిశీలించారు. భూముల హద్దులను క్షేత్రస్థాయిలో గుర్తించే ప్రక్రియపై అధికారులను, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా, పక్కాగా నిర్వహించాలని ఆర్డీవో సూచించారు. భూముల హద్దుల గుర్తింపు సమయంలో సంబంధిత రైతులు, భూ యజమానుల సమక్షంలో వివరాలను పరిశీలించి, అవసరమైన చోట సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. రీ-సర్వే పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా క్షేత్రస్థాయిలో సర్వే బృందాలు సమన్వయంతో పనిచేసి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రీ-సర్వే ద్వారా భూముల హద్దులు, రికార్డుల వివరాలు సక్రమంగా నమోదయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కొమటూర్ గ్రామంలో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన ఆర్డీవో.. పెండింగ్‌లో ఉన్న రీ-సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేసి, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.