Wednesday, September 23, 2026
Homeమెదక్బి.వి.ఆర్.ఐ.టి లో పాస్ పోర్ట్ మేళా

బి.వి.ఆర్.ఐ.టి లో పాస్ పోర్ట్ మేళా

📰 Generate e-Paper Clip

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 23:

నర్సాపూర్ (22) విదేశాల్లో ఉన్నత విద్యకు ఉన్న అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం నర్సాపూర్ లోని బి.వి. రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ ఫౌండేషన్ సమన్వయంతో విదేశీ ఉన్నత విద్యా సదస్సు–పాస్‌పోర్ట్ మేళా నిర్వహించారు. కళాశాల ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, స్వీడన్ తదితర దేశాలకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థులు ఆయా విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో నేరుగా మాట్లాడి వివిధ కోర్సులు, ప్రవేశ అవకాశాలు, విదేశీ విద్యా విధానాలు, ఉన్నత విద్యకు సంబంధించిన అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. పి.ఎఫ్.హెచ్.యూనివర్సిటీ, నియోమా బిజినెస్ స్కూల్, షులిచ్ స్కూల్ ఆఫ్ బిజినెస్, యూనివర్సిటీ ఆఫ్ యూటా–సాల్ట్ లేక్ సిటీ, కెక్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్, లండన్ సౌత్ బ్యాంక్ యూనివర్సిటీ, ఎమ్లియోన్ బిజినెస్ స్కూల్, క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్, ఎడిత్ కోవన్ యూనివర్సిటీ, నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ, యోంకోపింగ్ యూనివర్సిటీ, క్లార్క్‌సన్ యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొని విదేశీ విద్య అక్కడ ఉన్న అవకాశాలు వంటి వాటిపై అవగాహన కల్పించారు. అంతేగాక పాస్‌పోర్ట్ మేళాలో పాస్‌పోర్ట్ ప్రాధాన్యం, దరఖాస్తు ప్రక్రియపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో  కళాశాల డైరెక్టర్ డా. కె. లక్ష్మీ ప్రసాద్, ప్రిన్సిపాల్ డా. సంజయ్ దూబే  విభాగాధిపతులు, డీన్లు, సి డి సి డీన్ డా. జె. బంగారాజు, జి ఎస్ ఏ సి కోఆర్డినేటర్ కె. ప్రణిత మేనేజర్ శ్రీ బాపి రాజు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేష్, అన్ని విభాగాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!