Wednesday, September 23, 2026
Homeమెదక్కేసుల దర్యాప్తును సకాలంలో పూర్తి చేయాలి

కేసుల దర్యాప్తును సకాలంలో పూర్తి చేయాలి

📰 Generate e-Paper Clip

హవేలీఘనపూర్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 23:

మెదక్ జిల్లా(22) కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం హవేలీఘనపూర్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లోని కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, వివిధ రికార్డులను ఎస్పీ పరిశీలించారు. ప్రతి కేసులో అవసరమైన సాక్ష్యాధారాలను పకడ్బందీగా సేకరించి, దర్యాప్తును సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీస్ శాఖకు సంబంధించిన వివిధ అప్లికేషన్లలో కేసులు, దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి డేటాను అప్‌డేట్ చేయాలని సిబ్బందికి సూచించారు.

గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు

గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. నిమజ్జన మార్గాలు, నిమజ్జన ప్రదేశాలను ముందుగానే పరిశీలించి, అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని, గణేష్ మండపాల నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ తనిఖీ సందర్భంగా డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు సందీప్‌రెడ్డి, కృష్ణమూర్తి, ఎస్‌ఐ సత్యనారాయణతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!