Wednesday, September 23, 2026
Homeమెదక్దేవుడి ఆలయంలోనే దొంగల కన్ను!

దేవుడి ఆలయంలోనే దొంగల కన్ను!

📰 Generate e-Paper Clip

వేంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఆభరణాల చోరీ

A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 23:

మనోహరాబాద్ 22 మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కల్లాకల్ గ్రామంలోని బంగారమ్మ దేవాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆలయ పంతులు వేణుగోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయంలోని వేంకటేశ్వర స్వామి విగ్రహాలకు అలంకరించిన వెండి కిరీటం, వెండి పాదాలు, వెండి చేతులు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలయంలో చోరీ జరగడంతో భక్తులు, స్థానికుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. చోరీకి పాల్పడిన వ్యక్తులను గుర్తించి పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఆలయ పరిసరాల్లోని పరిస్థితులు, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలిస్తూ పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!