కేసుల దర్యాప్తును సకాలంలో పూర్తి చేయాలి
హవేలీఘనపూర్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 23: మెదక్ జిల్లా(22) కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం హవేలీఘనపూర్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లోని కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, వివిధ రికార్డులను ఎస్పీ పరిశీలించారు. ప్రతి కేసులో అవసరమైన సాక్ష్యాధారాలను పకడ్బందీగా సేకరించి, దర్యాప్తును...