సెప్టెంబర్ 30లోగా 100 శాతం ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 23:
మెదక్ జిల్లా (22) రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ (రైతు రిజిస్ట్రీ) చేసుకుని (రైతు ఐడీ ) పొందాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. మంగళవారం ఆమె ఒక ప్రకటనలో రైతులకు పలు సూచనలు చేశారు. ఇప్పటికే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు తమ ఫార్మర్ ఐడీని సులభంగా తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం ఫార్మర్ రిజిస్ట్రేషన్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి, తమ ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలని సూచించారు. అనంతరం ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేస్తే ఫార్మర్ ఐడీ నంబర్‌ను తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. సెప్టెంబర్ 30వ తేదీలోగా జిల్లాలో 100 శాతం ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ విజ్ఞప్తి చేశారు.

