Wednesday, October 14, 2026
Homeమెదక్సివిల్ ఇంజనీరింగ్ లో విస్తృత అవకాశాలు

సివిల్ ఇంజనీరింగ్ లో విస్తృత అవకాశాలు

📰 Generate e-Paper Clip

గ్లోబల్ సొల్యూషన్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు 

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 30:

నర్సాపూర్ (29) ప్రపంచవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, సుస్థిరతకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో సివిల్ ఇంజనీరింగ్ రంగంలో డిజైన్, స్ట్రక్చరల్,పర్యావరణం, సస్టైన్ బిలిటీ తదితర విభాగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని జాకబ్స్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గ్లోబల్ సొల్యూషన్స్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు బలుసు తెలిపారు. మంగళవారం బీవీఆర్‌ఐటీలో విష్ణు జాతీయ స్థాయి సర్వేయింగ్ 2026 పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయిలో 27 ఇంజినీరింగ్ కళాశాలు పాల్గొనగా కర్నాటక , ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. సర్వేయింగ్, ఫీల్డ్ మెజర్‌మెంట్స్, ఆధునిక సర్వేయింగ్ పద్ధతుల్లో విద్యార్థుల సాంకేతిక, ప్రాక్టికల్ నైపుణ్యాలను పరీక్షించడం తో పాటు, తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను వాస్తవిక పరిస్థితుల్లో అన్వయించుకునేలా ఈ పోటీనిరూపొందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాకబ్స్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గ్లోబల్ సొల్యూషన్స్ డైరెక్టర్  వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సర్వేయింగ్‌లో ఖచ్చితత్వం, నమ్మకం, బాధ్యత అత్యంత కీలకమని అన్నారు. సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాథమిక సర్వేయింగ్ సూత్రాలపై బలమైన పట్టు సాధించాలని సూచించారు.  అనంతరం గౌరవ అతిథిగా పాల్గొన్న నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా గజ్వేల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వై. మాధవి మాట్లాడుతూ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియాలో అందుబాటులో ఉన్న ఇంటర్న్‌షిప్ అవకాశాలను వివరించారు. ఈ పోటీలో పెద్ద సంఖ్యలో మహిళా విద్యార్థులు పాల్గొనడంఅభినందనీయమని పేర్కొన్నారు. సర్వేయింగ్ పరికరాలు, సాంకేతికతలపై అవగాహన పెంచుకుని, ఫీల్డ్‌లో ప్రత్యక్ష అనుభవం పొందాలని విద్యార్థులకు సూచించారు.

విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ చైర్మన్  రవిచంద్రన్ రాజగోపాల్ మాట్లాడుతూ, చైర్మన్  కె.వి. విష్ణు రాజు మార్గదర్శకత్వంలో కోర్ ఇంజినీరింగ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. సర్వేయింగ్, మ్యాపింగ్ సివిల్ ఇంజినీరింగ్‌లో కీలకమైన అంశాలని, విద్యార్థులకు ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్, హ్యాండ్స్-ఆన్ అనుభవం కల్పించేందుకు బీవీఆర్‌ఐటీ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. విద్యార్థుల ఉద్యోగ నైపుణ్యాల అభివృద్ధిలో భాగంగా బుధవారం సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రముఖ సివిల్ ఇంజనీరింగ్ కంపెనీస్ స్వధా బిల్డర్స్ , ప్రోథియన్స్ , కేపీసీ ప్రాజెక్ట్స్ , కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్ , జీకేసీ ప్రాజెక్ట్స్ , ఎఫెక్ట్ టెక్, సత్వ, ప్రెక్స్‌సర్వ్ కన్‌స్ట్రక్షన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆఫ్‌కాన్స్ ప్రాజెక్ట్స్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ విద్యార్థులను రిక్రూట్మెంట్ చేసుకుంటాయని తెలిపారు. అనంతరం కళాశాల డైరెక్టర్ డా. కె. లక్ష్మీ ప్రసాద్ సివిల్ ఇంజినీరింగ్‌లోని అవకాశాలను వివరించడంతో పాటు, ఏ ఎస్ సి ఈ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీలు విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సంజయ్ దుబే, డా. ఎస్. కృష్ణారావు, కళాశాల మేనేజర్ బి. బాపిరాజు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేష్, వివిధ విభాగాల అధిపతులు, డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!