A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 30:
శివంపేట(29) మండలంలోని సికింద్లాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఉమ్మడి మెదక్ జిల్లా సహాయ కమిషనర్ విజయ రామారావు సందర్శించారు. మంగళవారం ఉదయం శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంను సందర్శించి దేవాలయ నిర్వహణ పై మరియు ఆదివారం రాత్రి దేవాలయంలో జరిగిన చోరీ సంఘటన పై శాఖపరమైన విచారణ చేసి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఆయన వెంట మెదక్ జిల్లా హుండీ పరిశీలకులు(ఇన్స్పెక్టర్)వి.రంగారావు, జూనియర్ సహాయకులు నరసింహారెడ్డి, ఆలయ అర్చకులు ధనుంజయ శర్మ తదితరులు పాల్గొన్నారు.

