Tuesday, October 13, 2026
Homeమెదక్విద్యుత్ సమస్యలుంటే వెంటనే తెలియజేయండి

విద్యుత్ సమస్యలుంటే వెంటనే తెలియజేయండి

📰 Generate e-Paper Clip

ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే అదే రోజు మరో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తాం: ఏఈ రాజ్‌కుమార్

 

A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) అక్టోబర్ 12:

మనోహరాబాద్ (11)మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల పరిధిలోని రైతులు, ప్రజలు విద్యుత్ సమస్యలు ఎదుర్కొంటే వెంటనే విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని కల్లకల్ విద్యుత్ శాఖ ఏఈ రాజ్‌కుమార్ సూచించారు. గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద, విద్యుత్ లైన్ల వద్ద ఏవైనా సమస్యలు తలెత్తితే సంబంధిత సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. ముఖ్యంగా రైతుల వ్యవసాయ పొలాల వద్ద ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే ఆలస్యం చేయకుండా వెంటనే విద్యుత్ శాఖ సిబ్బందికి తెలియజేయాలని తెలిపారు. సమాచారం అందిన వెంటనే స్పందించి, అదే రోజు మరో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని ఏఈ రాజ్‌కుమార్ స్పష్టం చేశారు. రైతులు, ప్రజలు విద్యుత్ సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించే సమస్యలను వెంటనే తెలియజేసి, శాఖ సిబ్బందికి సహకరించాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!