క్లస్టర్–3లో ప్రథమ స్థానం.. మహిళల భద్రతలో విశేష ప్రతిభ
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 30:
మెదక్ జిల్లా ( 29) మహిళల భద్రత, ఈవ్టీజింగ్ నివారణ, అవగాహన కార్యక్రమాల్లో మెదక్ జిల్లా షీ టీమ్ క్లస్టర్–3లో ప్రథమ స్థానం సాధించింది. గత ఎనిమిది నెలలుగా నిరంతర పర్యవేక్షణ, విస్తృత అవగాహన కార్యక్రమాలు, సమర్థవంతమైన చర్యలతో షీ టీమ్ ఈ ఘనత సాధించిందని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తెలిపారు. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈవ్టీజింగ్, మహిళల వేధింపులను అరికట్టడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న షీ టీమ్ సిబ్బందిని అదనపు ఎస్పీ అభినందించారు. మహిళల భద్రతే లక్ష్యంగా ఇదే స్ఫూర్తితో మరింత సమర్థవంతంగా పనిచేయాలని షీ టీమ్ సిబ్బందికి సూచించారు.

