ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
A2న్యూస్,నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 30:
నర్సాపూర్ (29) మహిళా ఎమ్మెల్యేలపై దాడి కేసులో హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ మహిళా ఎమ్మెల్యేల పట్ల అమానుషంగా ప్రవర్తించడమే కాక తిరిగి తామే పోలీసుల పట్ల అసభ్యంగాప్రవర్తించామని కోర్టుకెళ్లడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇది ప్రజా పాలన ప్రభుత్వమా నయవంచన పాలనా అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కాలని చూడడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండని బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే దానికి సమాధానం చెప్పుకోలేక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని కోర్టు ధృవీకరించినందున ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలను మోసం చేయకుండా ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు.

