Thursday, October 29, 2026
Homeమెదక్మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీ-ఫైబర్ ఇంటర్నెట్ సేవలు

మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీ-ఫైబర్ ఇంటర్నెట్ సేవలు

📰 Generate e-Paper Clip

ప్రైవేట్ ఇంటర్నెట్ సేవల స్థానంలో టీ-ఫైబర్ వినియోగానికి చర్యలు చేపట్టాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 25 :

మెదక్ (24) జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు టీ-ఫైబర్ ఇంటర్నెట్ సేవల ఏర్పాటుపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ శాఖ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుతం వినియోగిస్తున్న ప్రైవేట్ ఇంటర్నెట్ సేవల స్థానంలో టీ-ఫైబర్ సేవలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ వినియోగం, అవసరమైన వేగం, సామర్థ్యం తదితర అంశాలపై సమగ్రంగా అంచనా రూపొందించి, ఆ వివరాల ఆధారంగా టీ-ఫైబర్ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మెరుగైన ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎఫ్‌ఓ జోజి, ఈడీఎం సందీప్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!