Thursday, October 29, 2026
Homeమెదక్అనారోగ్యంతో టీచర్ బలవన్మరణం

అనారోగ్యంతో టీచర్ బలవన్మరణం

📰 Generate e-Paper Clip

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) అక్టోబర్ 29 :

నర్సాపూర్ (28) అనారోగ్యంతో ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డ సంఘటన నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. ఎస్సై రంజిత్ రెడ్డి కథనం ప్రకారం. నర్సాపూర్ పట్టణానికి చెందిన సూరారం రమేష్ కుమార్ (40) మహమ్మదాబాద్ లోని ఎస్టి గురుకులపాఠశాలలో ప్రైవేటు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నట్లు తెలిపారు. గత కొంతకాలంగా ఆయన కడుపునొప్పితో బాధపడుతూ మంగళవారం రాత్రి కూడా కడుపునొప్పితో బాధపడ్డట్లు తెలిపారు. ఆసుపత్రికి వెళ్లాలని భార్య, తండ్రి సూచించినా మరుసటి రోజు వెళ్తానని బదులిచ్చి అదే రోజు రాత్రి అందరూ నిద్రిస్తుండగా తన బెడ్రూంలో ఉరివేసుకొని మృతి చెందాడనితెలిపారు.కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లుఎస్సైతెలిపారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారువైద్యులను సంప్రదించాలని, మానసిక ఒత్తిడికి గురైనప్పుడు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, వైద్యుల ను సంప్రదించాలని ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని ఎస్ఐ రంజిత్ రెడ్డి సూచించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!