కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు యం అడివయ్య
A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) అక్టోబర్ 29 :
మనోహరాబాద్ (28) రాష్ట్రంలో నేను పెద్ద మాదిగను అని ప్రగల్బాలు పలికిన రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో దళితులపై దాడులు జరుగుతుంటే కన్పించడం లేదా కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏం. అడివయ్య ప్రశ్నించారు. కెవిపిఎస్, ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో బుధవారం కోనాయిపల్లి గ్రామ దళితులతో కలిసి మనోహరాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కార్యాలయ అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం అడివయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో నేను పెద్ద మాదిగను అని ప్రగల్బాలు పలికిన రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో దళితులపై దాడులు జరుగుతుంటే కన్పించడం లేదా అని ప్రశ్నించారు. మాటలు కాదని, ముఖ్యమంత్రి చేతల్లో నిరూపించుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజా ప్రతినిధులే జిల్లాలో దళితులపై దాడులు చేస్తున్నారని అన్నారు. అక్టోబర్ 18 నాడు కొనాయిపల్లిలో దాడి జరిగి 10 రోజులు అవుతున్న నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడంలేదనిఅన్నారు.దళితులపై దాడి చేసిన గ్రామ సర్పంచ్ మన్నే కళ్యాణ్ వారీ అనుచరులను అరెస్ట్ చేయడంలో ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని అన్నారు. ఒక్క మెదక్ జిల్లాలోనే 7 గ్రామాల్లో దళితులపై దాడులు జరిగాయని తెలిపారు. దాడికి గురైన బాధితులను రెవిన్యూ, పోలీస్అధికారులుసందర్శించడం లేదని అన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ లకు వినతి పత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కావడం లేదని, కోనాయపల్లి కేసు విచారణ చేస్తున్న తుప్రాన్ డి.ఎస్.పి బాధితుల కోసం కాకుండా నిందితుల కోసం పని చేస్తున్నారని ఆరోపించారు.
తుప్రాన్ డి.ఎస్.పి విచారణపై కోనాయపల్లి దళితులకు నమ్మకం లేదని, ఆ అధికారిని మార్చాలని డిమాండ్ చేశారు. గ్రామంలో విచారణ పూర్తి అయినా నిందితులను అరెస్ట్ చేయకుండా కాలయాపన చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశించారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ మల్లేశం మాట్లాడుతూ దసరా, బతుకమ్మ, వినాయక చవితి ఉత్సవాల సందర్బంగా గ్రామాల్లో దళితులపై దాడులు జరిగాయని, దాడికి గురైన దళితులకు రక్షణ కల్పించడంలో జిల్లా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులే జిల్లాలో దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసులు, రెవిన్యూ అధికారులు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో దళితులపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ మహేందర్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ నాయకులు శ్రీనివాస్, గ్రామ దళితులు నర్సిములు, ప్రవీణ్, గురుదాసు, నిరంజన్ దాసు, నవీన్, మల్లేష్, మధు తదితరులు పాల్గొన్నారు.

