A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 2:
మెదక్ జిల్లా (1) జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమానికి సంబంధించిన గడువును ఎన్నికల సంఘం మరోసారి పొడిగించిందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారమ్‌ల సమర్పణకు చివరి తేదీని ఆగస్టు 10, 2026 వరకు పొడిగించినట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్లో నమోదు చేసుకోవాలని, అనర్హులు, మరణించిన వారు, ఒకే వ్యక్తి పేరుతో రెండుసార్లు నమోదైన ఓటర్ల వివరాలను తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. ఎస్ఐఆర్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి వంద శాతం నమోదు ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సవరించిన ఎస్ఐఆర్ షెడ్యూల్ ఇలా ఉంది:
ఎన్యూమరేషన్ ఫారమ్‌ల సమర్పణకు చివరి తేదీ: 10-08-2026 పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ: 10-08-2026 ముసాయిదా ఓటరు జాబితాల ప్రచురణ: 17-08-2026 క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ: 17-08-2026 నుంచి 16-09-2026 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం (నోటీసు కాలం): 17-08-2026 నుంచి 15-10-2026 వరకు తుది ఓటరు జాబితాల ప్రచురణ: 19-10-2026

