శ్రీకరి జ్యువెలర్స్, పాన్ బ్రోకర్స్ పూర్తి సహకారంతో మార్కెట్ యార్డ్ గణనాథుడి ఏర్పాటు
ముఖ్య అతిలుగా హాజరైన కౌడిపల్లి సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్, ఎస్సై అమరేందర్ రెడ్డి,
A2న్యూస్ కౌడిపల్లి ప్రతినిధి (బుచ్చన్న) సెప్టెంబర్ 20:
కౌడిపల్లి (19) మండల కేంద్రమైన కౌడిపల్లి మార్కెట్ యార్డులో శ్రీకరి జ్యువెలర్స్ సహకారంతో ఏర్పాటు చేసిన గణనాధునికి శ్రీకరి జ్యువెలర్స్ యజమాని ఆవుసుల నాగరాజు చారి, శివాని దంపతులు పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా కౌడిపల్లి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు, మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు, కౌడిపల్లి సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్, ఎస్ ఐ అమరేందర్, హాజరయ్యారు. గ్రామ పురోహితులు కొలచాల సుమన్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్,కి నాగరాజు దంపతులకు మార్కెట్ యార్డ్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు ఉప సర్పంచ్ శ్వేతా మల్లికార్జున్ గౌడ్,కు వార్డు సభ్యులు సందీప్, హరీష్, ఎస్సై అమరేందర్ రెడ్డి,కి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్, మాట్లాడుతూ… మార్కెట్ యార్డ్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున కౌడిపల్లి మార్కెట్ యార్డులో మొట్ట మొదటిసారిగా శ్రీకరి జ్యువెలర్స్, పూర్తి సహకారంతో గణేషుడిని ఏర్పాటు చేయడం సంతోషకరమని శ్రీకరి జ్యువెలర్స్ యజమాని నాగరాజు చారిని అభినందించారు. ఇలాగే గ్రామంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలకు దాతలు ముందుకొచ్చి మండపాల నిర్మాణం నుంచి నిమజ్జనం వరకు అందరూ కలిసి చేయి చేయి కలిపి భక్తిశ్రద్ధలతో గణేశుడిని ఏర్పాటు చేసుకొని నవరాత్రులు పూజలు అందించి నిమర్జనానికి ఎలాంటి లోటు పాట్లు కలగకుండా పోలీసుల ఆంక్షల మేరకు నిమజ్జనాలు చేసుకోవాలన్నారు. ఎస్ ఐ అమరేందర్ మాట్లాడుతూ… గణేష్ మండపాలు భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేసి కాలనీవాసులు అందరూ కలిసికట్టుగా ఆ గణనాధుడికి ప్రత్యేక పూజలు అందిస్తున్నందుకు గ్రామస్తులందరినీ అభినందించారు. అలాగే నిమజ్జన సమయంలో మద్యపానం సేవించి ఊరేగింపులో పాల్గొంటే ఇతరులకు ఇబ్బంది కలగడమే కాకుండా ఆ భగవంతుడికి నవరాత్రులు పూజలు అందించి చేసే నిమజ్జన కార్యక్రమాన్ని ఆ భగవంతుడు కూడా మెచ్చాలన్నారు. అనంతరం నాగరాజు చారి, మాట్లాడుతూ… నేను అన్నిటికంటే ఎక్కువగా దైవాన్ని నమ్ముతా ఆ భగవంతుడు నాకు కలిగించిన దాంట్లో కొంత భగవంతుడికి సేవ చేయడం కోసం ఖర్చు చేయడంలో మనసుకు మానసిక ప్రశాంతత దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఉపసర్పంచ్ శ్వేతా మల్లికార్జున్ గౌడ్, వార్డు సభ్యులు సందీప్ కుమార్,హరీష్, చిప్ప శ్రీనివాస్,దశరథ్,యాదగిరి, డాక్టర్ శ్రీనివాస్,సాయి చరణ్,నవీన్,డాకయ్య, మనీష్,నాని, వార్డు సభ్యులు గుడ్డంల శరత్,రెడ్డి మహేష్, తోపాటు పోలీస్ అధికారులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

