Wednesday, October 21, 2026
Homeమెదక్ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి జిల్లా అదనపు కలెక్టర్ నగేష్

ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి జిల్లా అదనపు కలెక్టర్ నగేష్

📰 Generate e-Paper Clip

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 19:

మెదక్: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 16 సాధారణ దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం చేయకుండా, సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఏఓ యూనస్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!