Wednesday, October 21, 2026
Homeమెదక్మనోహరాబాద్‌లో ఘనంగా దసరా సంబరాలు: సర్పంచ్ రాము యాదవ్

మనోహరాబాద్‌లో ఘనంగా దసరా సంబరాలు: సర్పంచ్ రాము యాదవ్

📰 Generate e-Paper Clip

A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) అక్టోబర్ 21 :

మనోహరాబాద్ (20) మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల వ్యాప్తంగా విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కొండాపూర్ గ్రామంలో సర్పంచ్ రాము యాదవ్ అధ్యక్షతన దసరా సంబరాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.గ్రామ నడిబొడ్డున జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండాకు పూజలు నిర్వహించి, పూలమాలలు వేసి, కొబ్బరికాయలు కొట్టి వేడుకలను ప్రారంభించారు. అనంతరం డప్పు చప్పుళ్ల మధ్య గ్రామస్థులు సమీపంలోని పొలాలకు వెళ్లి పాలపిట్టను దర్శించుకున్నారు.

అక్కడ జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, గాలిలో ఎగురుతున్న పాలపిట్టను దర్శించుకుని గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ రాము యాదవ్ మాట్లాడుతూ, చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి విజయదశమి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. దసరా పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతిసౌభాగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మాధవి వెంకటేష్ యాదవ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, చిన్నారులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొని పండుగ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!