Wednesday, October 21, 2026
Homeమెదక్ఘనంగా దసరా పండగ

ఘనంగా దసరా పండగ

📰 Generate e-Paper Clip

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) అక్టోబర్ 21:

నర్సాపూర్ (20) నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ లో దసరా పండుగ ఘనంగా జరిగింది. నర్సాపూర్ డివిజన్ లోని కొల్చారం, శివంపేట, కౌడిపల్లి, హత్నూర, చిలిపిచేడ్ మండలాల్లో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి నవరాత్రులు సైతం ఘనంగా నిర్వహించారు. ఇదిలా ఉండగా శివంపేటలోని భగలాముఖి అమ్మవారి దేవాలయంలో నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రతిష్టించి తొమ్మిది రోజులు రోజుకో అలంకారం చొప్పున విశేష రీతిలో పూజలు జరిపారు. ఇక దసరా పండగ సందర్భంగా అందరూ కొత్త బట్టలు ధరించి కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన జంబి కొట్టి పాలపిట్టను దర్శించుకుని, అమ్మవారి దర్శించుకోవడానికి వీరభద్ర స్వామి గుడికి వెళ్లారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో అక్కడ ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో నిండిపోయింది. ఇదిలా ఉండగా పండగ ఈసారి మధ్యతరగతి, పేదోడికి భారమైందని చెప్పాలి. ఓవైపు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల పేరిట ప్రయాణికుల నడ్డి విరవగా నాటు కోళ్లు, మాంసం, మందు విక్రయాలు సైతం అదే రికార్డు స్థాయిలో ధర పలికింది. పూజలకు వినియోగించే గుమ్మడికాయ, బంతిపూలు కూడా కిలో 100 రూపాయలకు పైగా ఉండటంతో మధ్యతరగతి, పేదలు జంకే పరిస్థితి నెలకొంది. మొత్తం మీద దసరా పండగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!