మనోహరాబాద్లో ఘనంగా దసరా సంబరాలు: సర్పంచ్ రాము యాదవ్
A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) అక్టోబర్ 21 : మనోహరాబాద్ (20) మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల వ్యాప్తంగా విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కొండాపూర్ గ్రామంలో సర్పంచ్ రాము యాదవ్ అధ్యక్షతన దసరా సంబరాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.గ్రామ నడిబొడ్డున జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండాకు పూజలు నిర్వహించి, పూలమాలలు వేసి, కొబ్బరికాయలు కొట్టి వేడుకలను ప్రారంభించారు. అనంతరం డప్పు చప్పుళ్ల మధ్య గ్రామస్థులు సమీపంలోని పొలాలకు వెళ్లి పాలపిట్టను దర్శించుకున్నారు. అక్కడ జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి,...