Wednesday, October 21, 2026
Homeమెదక్పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి

పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి

📰 Generate e-Paper Clip

విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరులకు ఘన నివాళులు

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 21:

మెదక్ : శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటుందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి అమరుల సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించి అమరులైన పోలీసుల త్యాగాలను గుర్తుచేసుకోవడం, వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని పేర్కొన్నారు. పోలీసులు నిరంతరం శాంతిభద్రతల పరిరక్షణతో పాటు జిల్లాలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అకాల వర్షాలు, ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు అధికారులు నిరంతరం సేవలందిస్తున్నారని అన్నారు.ప్రతిరోజూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ, ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ధైర్యంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల సేవలు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కొనియాడారు. అమరవీరుల త్యాగాలు వృథా కాకుండా, వారి స్ఫూర్తితో మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని పోలీసు సిబ్బందికి పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రశాంత వాతావరణం, శాంతిభద్రతలు నెలకొన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

మారుతున్న నేర స్వరూపానికి అనుగుణంగా పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ సైబర్ నేరాలను సమర్థవంతంగా ఛేదిస్తున్నారని, తక్కువ సమయంలోనే నేరస్థులను గుర్తించి పట్టుకుంటున్నారని తెలిపారు.అనంతరం పోలీసు అమరవీరుల కుటుంబాలకు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు గిఫ్ట్ ప్యాక్‌లను అందజేశారు. వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!