A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 23:
నర్సాపూర్ (22) పట్టణంలోని గణేష్ మండపాలను మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పరిశీలించారు. మండపాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు పాయింట్ బుక్‌ను తనిఖీ చేశారు. గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు నిర్వాహకులు, యువత పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని అదనపు ఎస్పీ సూచించారు. నిమజ్జన ఊరేగింపులో క్రమశిక్షణ పాటిస్తూ, ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. చెరువులు, కుంటల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే మద్యం సేవించి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనవద్దని యువతకు స్పష్టం చేశారు. డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్ సిస్టమ్‌ల వినియోగంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించిన అదనపు ఎస్పీ, నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

