గణేష్ మండపాలను పరిశీలించిన అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్
A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 23: నర్సాపూర్ (22) పట్టణంలోని గణేష్ మండపాలను మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పరిశీలించారు. మండపాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు పాయింట్ బుక్‌ను తనిఖీ చేశారు. గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు నిర్వాహకులు, యువత పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని అదనపు ఎస్పీ సూచించారు. నిమజ్జన ఊరేగింపులో క్రమశిక్షణ పాటిస్తూ, ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు....