Saturday, August 1, 2026
Homeమెదక్మెదక్ కలెక్టరేట్‌లో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం వర్చువల్‌గా వీక్షణ

మెదక్ కలెక్టరేట్‌లో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం వర్చువల్‌గా వీక్షణ

📰 Generate e-Paper Clip

A2న్యూస్, జులై 10, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్,(9) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభమైన యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా క్రీడా శాఖ అధికారులు వర్చువల్ విధానంలో వీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, నైపుణ్యంతో కూడిన క్రీడాకారుల తయారీకి ఈ విశ్వవిద్యాలయం కీలకంగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాజు, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి రమేష్ గంగాల, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి నాగరాజు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి నీలిమ, డీపీఆర్‌ఓ రామచంద్ర రాజు, మున్సిపల్ కార్యాలయ మేనేజర్ భవానీ, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి మధుసూదన్, వ్యాయామ ఉపాధ్యాయులు మాధవరెడ్డి, ప్రతాప్ సింగ్, వినోద్, దేవేందర్ రెడ్డి, రవి, ప్రభాకర్, మనోహర్, మంజుల, ఆఫ్రిన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!