Wednesday, October 28, 2026
Homeమెదక్మెదక్ జిల్లాలో అటవీ సంరక్షణకు ప్రత్యేక చర్యలు

మెదక్ జిల్లాలో అటవీ సంరక్షణకు ప్రత్యేక చర్యలు

📰 Generate e-Paper Clip

కలప, వన్యప్రాణుల స్మగ్లింగ్ అరికట్టడమే లక్ష్యం: కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 25 :

మెదక్ (24) జిల్లాలో అటవీ విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు, అటవీ భూముల ఆక్రమణలు, అక్రమ కలప రవాణా, వన్యప్రాణుల స్మగ్లింగ్‌ను అరికట్టడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. అటవీ సంరక్షణ, పర్యావరణ సమతుల్యత పరిరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అటవీ సంరక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ ప్రతిమా సింగ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అటవీ సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, అటవీ భూముల పరిరక్షణ, అక్రమ కార్యకలాపాల నియంత్రణ, పచ్చదనం పెంపుపై చర్చించారు. జిల్లాలో అటవీ భూములు ఆక్రమణలకు గురికాకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అటవీ సరిహద్దులను జియో-ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షిస్తూ, భూముల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పోడు భూముల సమస్యల పరిష్కారంతో పాటు అక్రమ కలప రవాణా, వన్యప్రాణుల వేటను అరికట్టేందుకు అటవీ, పోలీస్ శాఖలు సంయుక్తంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు, నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో ప్రజలు, యువతకు అడవుల ప్రాముఖ్యతపై అవగాహన సదస్సులు నిర్వహించాలని, అటవీ సంరక్షణ కార్యక్రమాల్లో స్థానిక ప్రజలను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి జో జి మాట్లాడుతూ, అటవీ చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అడవుల పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ అంబాదాస్ రాజేశ్వర్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నీలిమ, డీఎస్పీ ప్రసన్న కుమార్, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!