Sunday, June 21, 2026
Homeతెలంగాణదర్శకులు ఆదిత్య కు ఆత్మ నిర్భర్ భారత్ గౌరవ్ సమ్మాన్

దర్శకులు ఆదిత్య కు ఆత్మ నిర్భర్ భారత్ గౌరవ్ సమ్మాన్

📰 Generate e-Paper Clip

ఏ2న్యూస్, జూన్ 14, ప్రత్యేక ప్రతినిధి (మల్పర్తి రామచందర్)

సినీ రంగంలో గత 30 సంవత్సరాలుగా విశిష్ట సేవలందిస్తూ ఎంతోమంది నూతన కళాకారులకు అవకాశాలిస్తూ తన సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని సాగిస్తున్న సినీ దర్శకుడు ఆదిత్య కు మరో అత్యున్నత పురస్కారం తగ్గింది.భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర్ భారత్ గౌరవ్ సమ్మాన్ 2026అత్యున్నత పురస్కారం విలక్షణ దర్శకుడు నిత్య ప్రయోగశీలి పీసీ ఆదిత్య కు అందజేశారు. దర్శకుడు ఆదిత్య తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో 11 పూర్తిస్థాయి సినిమాలు 150 కి పైగా సందేశాత్మక లఘు చిత్రాలు రూపొందించి ప్రపంచ రికార్డుతో పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పలు సన్మానాలు అవార్డులు రికార్డులు అందుకున్న విషయం సుపరిచితమే. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత డా.పిసి ఆదిత్య స్పందిస్తూ ఆత్మ నిర్భర్ భారత గౌరవ సమాన్ 2026 అందుకోవడం భారతీయ చలనచిత్ర దర్శకుడిగా ఎంతో సంతోషాన్ని కలిగించిందని, దాంతోపాటు సందేశాత్మక లఘు చిత్రాల దర్శకుడిగా తనపై మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. ఇదే ఉత్సాహంతో మరిన్ని సందేశాత్మక చిత్రాలను రూపొందిస్తానని ఆయన తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!