Tuesday, October 13, 2026
Homeమెదక్ట్రిపుల్ ఆర్ భూముల సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

ట్రిపుల్ ఆర్ భూముల సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

📰 Generate e-Paper Clip

అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 25:

మెదక్ జిల్లా(24) జిల్లాలో ట్రిపుల్ ఆర్ (ఆర్ఆర్ఆర్)కు సంబంధించిన భూముల జాయింట్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో డీఆర్ఓ, ఆర్డీఓ, ఏ.డీ. సర్వే, తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఆర్‌కు సంబంధించిన భూముల సర్వే, రెవెన్యూ–అటవీ భూముల సరిహద్దులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో చర్చించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ట్రిపుల్ ఆర్‌కు సంబంధించిన భూములను రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో జాయింట్ సర్వే నిర్వహించాలని సూచించారు. రెవెన్యూ, ఫారెస్ట్ భూముల సరిహద్దులను పకడ్బందీగా గుర్తించి, అవసరమైన చోట రీ-సర్వే చేపట్టాలని ఆదేశించారు. రెవెన్యూ, అటవీ భూములకు సంబంధించిన సమస్యల కారణంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సర్వే ప్రక్రియలో స్పష్టత, పారదర్శకత పాటిస్తూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ అంబాదాస్ రాజేశ్వర్, నర్సాపూర్ ఆర్డీఓ రామకృష్ణ, ఏ.డీ. సర్వే కిషన్, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!