Tuesday, October 13, 2026
Homeమెదక్మెదక్‌లో త్వరలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్

మెదక్‌లో త్వరలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్

📰 Generate e-Paper Clip

29,183 మంది విద్యార్థులకు ప్రతిరోజూ పోషకాహార అల్పాహారం

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 25:

మెదక్ జిల్లా (24) తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్లో భాగంగా మెదక్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా అమలు భాగస్వామిగా వ్యవహరిస్తోంది. స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్‌ను ప్రభుత్వం తొలుత పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్‌లో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించింది. కార్యక్రమానికి లభించిన స్పందనతో మధిర, మంథని, మంచిర్యాల, కరీంనగర్ తదితర ప్రాంతాల్లోనూ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించే చర్యల్లో భాగంగా మెదక్‌లో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ద్వారా మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల పరిధిలోని దాదాపు 11 మండలాల్లో 395 ప్రభుత్వ పాఠశాలలు, 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 29,183 మంది విద్యార్థులకు ప్రతిరోజూ పరిశుభ్రమైన, రుచికరమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించనున్నారు. ఎన్‌ఐఎన్ సహకారంతో పోషకాహార మెనూ విద్యార్థులకు సమతుల్యమైన పోషకాహారం అందించేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ ఐ ఎన్) సహకారంతో ప్రత్యేక మెనూను రూపొందించారు. ప్రతిరోజూ విద్యార్థులకు ఒక్కో రకమైన అల్పాహారం అందించేలా మెనూను సిద్ధం చేశారు.

అల్పాహార మెనూ:

ఇడ్లీ – సాంబార్, పూరి – ఆలూ కుర్మా, దోశ – చట్నీ, ఉప్మా – చట్నీ మిల్లెట్ ఇడ్లీ – సాంబార్ బోండా – చట్నీ,వీటితో పాటు రోజు విడిచి రోజు విద్యార్థులకు పాలు కూడా అందించనున్నారు.

ఆరోగ్యం.. ఏకాగ్రతే లక్ష్యం

ఉదయం పూట విద్యార్థులకు పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, ఏకాగ్రత, పాఠశాల హాజరు మెరుగుపడేలా కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయనున్నారు. విద్యార్థులు ఆకలితో పాఠశాలకు రాకుండా, ఆరోగ్యకరమైన అల్పాహారంతో ఉత్సాహంగా తరగతులకు హాజరై చదువుపై మరింత దృష్టి సారించేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా అధికారులు పేర్కొంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!