మెదక్‌లో త్వరలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్

29,183 మంది విద్యార్థులకు ప్రతిరోజూ పోషకాహార అల్పాహారం A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 25: మెదక్ జిల్లా (24) తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్లో భాగంగా మెదక్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా అమలు భాగస్వామిగా వ్యవహరిస్తోంది. స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్‌ను ప్రభుత్వం తొలుత పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్‌లో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్...