Thursday, October 15, 2026
Homeమెదక్నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

📰 Generate e-Paper Clip

కొంటూర్ చెరువు వద్ద భద్రతా ఏర్పాట్లపై

అధికారులకు పలు సూచనలు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 25:

మెదక్ (24) శుక్రవారం జరగనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో కొంటూర్ చెరువు వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు. నిమజ్జన ప్రాంతంతో పాటు శోభాయాత్ర సాగనున్న మార్గాలను పరిశీలించిన ఎస్పీ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన ప్రాంతంలో బారికేడింగ్, లైటింగ్, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. చెరువులో నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిమజ్జనం కోసం వినియోగించే క్రేన్లను నడిపే సిబ్బంది అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, నిమజ్జనం సమయంలో భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ సూచించారు. శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా కీలక ప్రాంతాల్లో పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయాలని తెలిపారు. నిమజ్జన ప్రాంతంలో నిరంతర పోలీసు పర్యవేక్షణ కొనసాగించాలని, విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేస్తూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పేర్కొన్నారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, మున్సిపల్ కమిషనర్, సీఐ కృష్ణమూర్తి, సందీప్ రెడ్డి తదితరులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!