నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
కొంటూర్ చెరువు వద్ద భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 25: మెదక్ (24) శుక్రవారం జరగనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో కొంటూర్ చెరువు వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు. నిమజ్జన ప్రాంతంతో పాటు శోభాయాత్ర సాగనున్న మార్గాలను పరిశీలించిన ఎస్పీ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన ప్రాంతంలో బారికేడింగ్, లైటింగ్, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లను...