Friday, July 31, 2026
Homeమెదక్నర్సాపూర్ బీవీఆర్ఐటీకి ప్రతిష్ఠాత్మక "మ్యాథ్‌వర్క్స్ క్రెడెన్షియలింగ్ అవార్డు

నర్సాపూర్ బీవీఆర్ఐటీకి ప్రతిష్ఠాత్మక “మ్యాథ్‌వర్క్స్ క్రెడెన్షియలింగ్ అవార్డు

📰 Generate e-Paper Clip

A2న్యూస్, జులై 22, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్)

నర్సాపూర్ (21) డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ లోని బీవీఆర్ఐటీ కళాశాలకు ప్రతిష్ఠాత్మక “మ్యాథ్‌వర్క్స్ క్రెడెన్షియలింగ్ అవార్డు 2026 దక్కింది. ఇంజినీరింగ్ విద్యలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల వినియోగానికి ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక శిక్షణ అందిస్తున్న బి.వి. రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్ఐటీ), నర్సాపూర్ కళాశాలకు “మ్యాథ్‌వర్క్స్ క్రెడెన్షియలింగ్ అవార్డు – 2026” లభించింది. కళాశాలలో మాథ్ లాబ్/ సిమ్లింక్ సాఫ్ట్‌వేర్‌ను బోధన, పరిశోధన మరియు విద్యార్థుల ప్రాజెక్టులలో సమర్థవంతంగా వినియోగిస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డును 2026 జూలై 21న హైదరాబాద్‌లోని మ్యాథ్‌వర్క్స్ కార్యాలయంలోనిర్వహించిన కార్యక్రమంలో ప్రదానం చేశారు. ఈ అవార్డును శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ చైర్మన్ శ్రీ రవిచంద్రన్ రాజగోపాల్, బీవీఆర్ఐటీ ప్రిన్సిపాల్ డా. సంజయ్ దుబే, ఈఈఈ విభాగాధిపతి డా. రాయుడు, ఈసీఈ విభాగాధిపతి డా. సంజీవ రెడ్డి, ఈఈఈ విభాగ ప్రొఫెసర్ డా. భూపాల్ స్వీకరించారు. ఈ అవార్డు బీవీఆర్ఐటీ నర్సాపూర్‌లో సాంకేతిక విద్యా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని కళాశాల యాజమాన్యం పేర్కొంది. విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగానైపుణ్యాలను పెంపొందించుకునేలా భవిష్యత్తులో మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!