నర్సాపూర్ బీవీఆర్ఐటీకి ప్రతిష్ఠాత్మక “మ్యాథ్‌వర్క్స్ క్రెడెన్షియలింగ్ అవార్డు

A2న్యూస్, జులై 22, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) నర్సాపూర్ (21) డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ లోని బీవీఆర్ఐటీ కళాశాలకు ప్రతిష్ఠాత్మక "మ్యాథ్‌వర్క్స్ క్రెడెన్షియలింగ్ అవార్డు 2026 దక్కింది. ఇంజినీరింగ్ విద్యలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల వినియోగానికి ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక శిక్షణ అందిస్తున్న బి.వి. రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్ఐటీ), నర్సాపూర్ కళాశాలకు "మ్యాథ్‌వర్క్స్ క్రెడెన్షియలింగ్ అవార్డు – 2026" లభించింది. కళాశాలలో మాథ్ లాబ్/ సిమ్లింక్ సాఫ్ట్‌వేర్‌ను బోధన, పరిశోధన మరియు విద్యార్థుల ప్రాజెక్టులలో సమర్థవంతంగా వినియోగిస్తున్నందుకు గుర్తింపుగా ఈ...