Tuesday, September 15, 2026
Homeమెదక్దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోం

దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోం

📰 Generate e-Paper Clip

ఎస్ ఎఫ్ మెదక్ జిల్లా కన్వీనర్ మాశివనోళ్ల నాగరాజు 

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 15 :

నర్సాపూర్ (14)  దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోమని ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ ఎఫ్ మెదక్ జిల్లా కన్వీనర్ మాశివనోళ్ల నాగరాజు అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ దళితుల ఆత్మ గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు, చర్యలు ఎవరు చేసినా సహించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మాదిగ- మాల-ఉపకులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇంద్ర పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించినట్లు తెలిపారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద దళితులు నిరసన తెలిపి వెళ్లిన అనంతరం వారు నడిచిన ప్రదేశాన్ని శుద్ధి చేయిస్తూ వచ్చిన ఘటన దళితుల మనోభావాలను తీవ్రంగాగాయపరిచిందన్నారు. కెసిఆర్ దళిత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాత మధు పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది రాజకీయ పోరాటం కాదని దళితుల ఆత్మగౌరవం, అంబేద్కర్ ఆశయాల పరిరక్షణ కోసం చేపట్టినఉద్యమం అని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!