Wednesday, September 16, 2026
Homeమెదక్మండలాల్లో ప్రతి సోమవారం ప్రజావాణి

మండలాల్లో ప్రతి సోమవారం ప్రజావాణి

📰 Generate e-Paper Clip

-జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 17:

మెదక్ జిల్లా (16) జిల్లా ప్రజల సమస్యలను స్థానికంగానే పరిష్కరించేందుకు ఆగస్టు 17వ తేదీ నుంచి ప్రతి సోమవారం అన్ని మండలాల ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు, వినతులను మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో సమర్పించాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల మండలస్థాయి అధికారులు సకాలంలో హాజరై ప్రజల నుంచి వచ్చే సమస్యలను స్వీకరించాలని ఆదేశించారు. ప్రజల సౌకర్యార్థమే ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయిలో నిర్వహిస్తున్నామని, ఇకపై తమ సమస్యలు, వినతులు అందించేందుకు జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. మండల స్థాయిలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి, వాటిని ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో సమర్పించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!